మంచిర్యాలటౌన్: స్వామివివేకానంద జయంతి పురస్కరించుకుని రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 6, 7 తేదీల్లో సికింద్రాబాద్‌లోని బోర్డ్స్ క్లబ్స్ ట్యాంక్‌బండ్, యూత్ సర్వీసెస్ హెడ్ ఆఫీస్ ఆడిటోరియంలో నిర్వహించే పోటీలకు వెళ్లే విజేతలు రిపోర్టు చేయాలని జిల్లా యువజనుల, క్రీడల శాఖ అధికారి రాజ్‌వీర్ ఓ ప్రకటనలో తెలిపా రు. జిల్లాలో నిర్వహించిన యూత్ ఫెస్టివల్‌లో నిర్వహించిన పోటీల్లో ప్రథమస్థానంలో గెలిచి ఎంపికై న విద్యార్థులు సోమవారం ఉదయం 4 గంటలకు మంచిర్యాల బస్టాండ్‌లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. వివరాలకు బాక్సింగ్ కోచ్ రాజేశ్ సెల్ 9963539234 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. పాల్గొనే విద్యార్థులు రెండు పాస్‌ఫొటోలు, ఆధార్ కార్డు, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్, బోనాఫైడ్, ఎస్సెస్సీ మెమో జిరాక్స్‌లతో హాజరుకావాలని తెలిపారు.
ఎంపికై న వారి వివరాలు..
పోయెట్రీలో బి.శ్రీవల్లి, స్టోరీ రైటింగ్‌లో ఏ.అంజలి, పెయింటింగ్‌లో ఏ.వర్ష, సైన్స్‌ఫేర్‌లో ఇన్షా తన్రీమ్, టి.అమూల్య, గ్రూప్ ఫోక్‌డాన్స్‌లో విష్ణుప్రియ, ఎన్.అక్షయ, స్నేహితవర్మ, ఈ.అక్షయ, భవ్య, అలేఖ్య, హర్షిని, వైశాలి, శేశ్విత, కె.శృతి, గ్రూప్ ఫోక్ డ్యాన్స్ జె.మౌనిక, డి.మాలతి, బి.కాంతి, దీక్షిత, డిక్లమేషన్‌లో ఆర్.సౌమ్య, ఏ.లిఖిత ఎంపికయ్యారు.
ఐదుగురు బైండోవర్
సిర్పూర్(టి): పశువుల అక్రమ రవాణాలో పట్టుబడిన ఐదుగురిని తహసీల్దార్ శ్రీనివాస్ ఎదుట శనివారం బైండోవర్ చేసినట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. వీరిలో రాజేందర్, సతీశ్, సారయ్య, అఫ్జల్, భాస్కర్ ఉన్నారు. పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.
పేకాటస్థావరంపై దాడులు
దహెగాం: ఎస్పీ డీవి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మండలంలోని ఇట్యాల శివారులో పేకాటస్థావరంపై శనివారం దాడులు నిర్వహించినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులో తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏడుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. పేకాట ఆడుతున్న వారి నుంచి నుంచి రూ.35,320 నగదుతోపాటు 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని దహెగాం పోలీసుస్టేషన్‌లో అప్పగించామన్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్సై వెంకటేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment