నీల్వాయిలో బర్డ్‌వాక్
వేమనపల్లి: నీల్వాయి ప్రాజెక్టు పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం బర్డ్‌వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ ఎన్నో వైవిధ్యమైన పక్షి జాతులు ఉన్నట్లు రిసోర్స్‌పర్సన్ రాంజాన్ విరాని గుర్తించారు. వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నీల్వాయి ప్రాజెక్టు పరిసరాలు అరుదైన పక్షులకు నిలయమని నీల్వాయి, చెన్నూర్ అటవీ రేంజర్లు అప్పలకొండ, శివకుమార్ తెలిపారు. డీఆర్వోలు ప్రమోద్‌కుమార్, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు పాల్గొన్నారు.
ధర్నా జయప్రదం చేయండి
ఎదులాపురం: వ్యవసాయ కూలీలకు కూలీబంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 6న కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో సుందరయ్య భవనంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ కూలీలకు కూలీబంధు అమలు చేయాలని, గ్రామసభలో అర్హులైన కూలీలను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలు ఈ ధర్నాలో అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి, నాయకులు ఆశన్న, కిష్టన్న, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment