బోథ్: చోరీ కేసులో మైనర్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద గల ఈనెల 2న సూర్యవంశీ ఉలాజీ ఇంటికి తాళం వేసి చేనుకు వెళ్లాడు. పనులు ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి రాగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో తన ప్యాంటు జేబులో ఉంచిన రూ. 10 వేల నగదు కనిపించలేదు. తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీని పరిశీలించారు. మైనర్ ఇంటి తాళం పగలకొట్టిన వీడియో రికార్డు అయింది. శనివారం మైనర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. అతని నుంచి రూ.10 వేల నగదను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
నేడు కడెం ఆయకట్టుకు నీటి విడుదల
కడెం: కడెం ఆయకట్టు యాసంగి పంటలకు ఆదివారం నీటిని విడుదల చేయనున్నట్లు డీఈ ఈ నవీన్ పేర్కొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తారని తెలిపారు.
చోరీకి గురైన వస్తువులు అప్పగించాలి
బెల్లంపల్లి: గతనెల 29వ రాత్రి తనపై హత్యాయత్నం చేసి చోరీ చేసిన తన వస్తువులను తిరిగి అప్పగించాలని ఆరిజిన్ డెయిరీ సీఈవో కందిమళ్ల ఆదినారాయణ కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తనకు ప్రా ణహాని ఉండటంతో బెల్లంపల్లి వన్‌టౌన్ ఎస్ హెచ్‌ఓ దేవయ్యకు శనివారం వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో యూనియన్ బ్యాంకు వీధిలో సెలూన్ షాప్‌వద్దకు వెళ్లగా రాగం శెట్టి సతీశ్, శ్యామ్ మరో ఆరుగురు తనపై హత్యాహత్నం చేశారన్నారు. ఆ దాడిలో తన వద్ద ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు చైన్, రూ.10,500 నగదు, రెండు సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment