సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
● ఈనెల 7 నుంచి 13 వరకు.. ● ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 290 సర్వీసులు ● 15 నుంచి 20 వరకు జేబీఎస్‌కు తిరుగు ప్రయాణం ● 195 బస్సులను సిద్ధం చేసిన ఆర్టీసీ
మంచిర్యాలఅర్బన్: సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారి కోసం టీజీఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు బస్సులు నడపాలని నిర్ణయించింది. ఆదిలాబాద్ రీజియన్‌లో ఆయా డిపోల బస్సులను జేబీఎస్ నుంచి 7 నుంచి 13 వరకు 290 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు ఈనెల 11 వరకు సెలవులు ప్రకటించడం, హైదరాబాద్‌కు వ్యాపార, ఉద్యోగరీత్యా వెళ్లినవారు.. చదువుల నిమిత్తం ఉన్న విద్యార్థులందరూ పండుగకు సొంతూళ్లకు వెళ్తుంటారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సులు నడిపేలా ఆర్టీసీ యోచిస్తోంది. మహాలక్ష్మీ పథకంతో హైదరాబాద్ నుంచి వచ్చే మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులను మరింత పెంచనున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 7 నుంచి 13 వరకు..
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. గతంలో భైంసా, ఉట్నూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపిన ఆశించిన మేర ఆదాయం రాలేదు. ఈ ఏడాది ఈనెల 10, 11న మాత్రమే ఒక్కో బస్సు సర్వీసు నడపనుంది. అత్యధికంగా నిర్మల్ డిపో బస్సులు 88, మంచిర్యాల నుంచి 82 వరకు ఉన్నాయి. మిగిలిన ఐదు డిపోల నుంచి ఈనెల 7 నుంచి 13 వరకు బస్సులను జేబీఎస్ నుంచి గమ్యస్థానాలకు వెళ్లనున్నాయి. ఆదిలాబాద్ నుంచి 58, భైంసా–02 నిర్మల్–88 ఉట్నూర్–02, ఆసిఫాబాద్–58, మంచిర్యాల డిపో నుంచి 81 బస్సులను ఏర్పాటు చేశారు. ఈనెల 10 నుంచి ప్రయాణికుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో అధిక బస్సులు న డిపేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
తిరుగు ప్రయాణంలో కూడా..
సంక్రాంతి నేపథ్యంలో తిరుగు ప్రయాణంతో రద్దీ అధికంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వచ్చి వెళ్లేవారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. రద్దీకి అనుగుణంగా బస్సుల రాకపోకలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ డిపోల నుంచి ఈనెల 15 నుంచి 20 వరకు 195 బస్సులు నడపనున్నారు. ఆదిలాబాద్ డిపో బస్సులు 31, భైంసా 4, నిర్మల్ 71, ఉట్నూర్ 1, ఆసిఫాబాద్ 38, మంచిర్యాల 50 బస్సులను తిరుగుప్రయాణానికి వెళ్లే వారి కోసం జేబీఎస్ వరకు ఆర్టీసీ బస్సులను నడపనుంది.
ఉట్నూర్ డిపో నుంచి ఈనెల 16న బక బస్సు
మాత్రమే నడపనున్నారు.
ఉట్నూర్ డిపో బస్సుల రాకపోకలు: ఈనెల10, 11న బస్సు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి.
రద్దీకి అనుగుణంగా బస్సులు
పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతాం. రద్దీ ఎక్కువగా అప్పటికప్పుడు బస్సులు ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలే ఉంటాయి. రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. బస్సు ఎక్కేటప్పుడు క్యూ పద్ధతి పాటించాలి. ప్రయాణికులకు జేబీఎస్ బస్‌స్టేషన్‌లో ఎప్పటికప్పుడు బస్సుల సమాచారం అందిస్తారు.
– సోలోమాన్, ఆర్‌ఎం, ఆదిలాబాద్
తిరుగు ప్రయాణం కోసం..
తేదీ ఆదిలాబాద్ భైంసా నిర్మల్ ఆసిఫాబాద్ మంచిర్యాల
15 07 02 15 08 10
16 08 02 16 10 12
17 04 0 10 05 07
18 04 0 10 05 07
19 04 0 10 05 07
20 04 0 10 05 07
జేబీఎస్ నుంచి ఆదిలాబాద్ రీజియన్‌కు బస్సుల వివరాలు
తేదీ ఆదిలాబాద్ భైంసా నిర్మల్ ఆసిఫాబాద్ మంచిర్యాల
07 02 0 03 02 03
08 02 0 03 02 02
09 04 0 06 04 06
10 15 01 23 15 20
11 15 01 23 15 20
12 10 0 15 10 15
13 10 0 15 10 15
Comments
Please login to add a commentAdd a comment