కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య
దండేపల్లి: కడుపునొప్పి భరించలేక యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఉదయ్‌కిరణ్ కథనం ప్రకారం..మండలంలోని వెల్గనూర్ గ్రామానికి చెందిన మెండ మహేశ్ (24) గత రెండేళ్ల క్రితం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున పెద్ద ఆసుపత్రిలో చూపించలేదు. దీంతో తరచూ కడుపు నొప్పితో బాధపడేవాడు. ఈక్రమంలో నొప్పి భరించలేక శుక్రవారం గ్రామ పంచాయతీ భవనం సమీపంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment