మెరుగైన విద్యనందించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థినులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరుపట్టిక, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. విద్యాబోధన తీరు గురించి పదో తరగతి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. రక్త నత అరికట్టేలా విటమిన్ ‘సీ’టాబ్లెట్లు ఇవ్వాలన్నారు. మొవా లడ్డూ, గుడ్లు, పాలు, రాగి మాల్టా అందించాలన్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయలు ఉన్నారు.
గిరిజన పోషణ మిత్ర పథకం ప్రారంభం
ఉమ్మడి ఆదిలాబాద్ ఐటీడీఏ పరిధిలోని 60 ఆశ్రమ బాలికల పాఠశాలలు, వసతి గృహాల్లో గిరిజన పోషణ మిత్ర పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. పథకం అమలుకు ప్రత్యేక ఽఅధికారులను నియమించనున్నట్లు తెలిపారు. వారంలో రెండు సార్లు ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు సందర్శించి నివేదికను పీవోకు అందిస్తారని పేర్కొన్నారు. విద్యార్థినులు రక్తహీనత బారినపడకుండా ఇప్పపువ్వు లడ్డూ, విటమిన్ ‘సీ’, ఐరన్ మాత్రలను ప్రతీ వారం రెండు సార్లు అందిస్తారని తెలిపారు. ఐటీడీఏ ఉద్యాన నర్సరీల్లో పెంచిన కరివేపాకు, మునగ తదితర మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.
‘గిరిజన పోషణమిత్ర’పకడ్బందీగా అమలు చేయాలి
నార్నూర్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన పోషణ మిత్ర పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఐటీడీఏ హార్టికల్చర్ అధికారి సందీప్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని జామడ, నార్నూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలను శనివారం ఆయన సందర్శించారు. పాఠశాలలో రికార్డులు, వంట గదులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. మహువా లడ్డూతోపాటు విటమిన్ సి మాత్రలను వారంలో రెండుసార్లు విద్యార్థినులకు అందిస్తారన్నారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్‌ఎంలు చౌహన్ వందన, విట్టల్, వార్డెన్ వనిత పవర్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment