జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ
మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని బాలికల ఉ న్నత పాఠశాలలో గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞా న ప్రతిష్టాన్, సోషల్ స్టడీస్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 140 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంగ్లిష్ మీడియం నుంచి షేక్ అశ్వక్ (జెడ్పీహెచ్‌ఎస్, కలమడుగు), అక్షయ(జెడ్పీహెచ్‌ఎస్, వెల్గనూర్), అక్షిత (జెడ్పీహెచ్‌ఎస్, సబ్బెపల్లి), నిషిన్‌కుమార్ (జెడ్పీహెచ్‌ఎస్, కలమడుగు), తెలుగు మీడియంలో చరణ్ (జెడ్పీహెచ్‌ఎస్, కిష్టాపూర్), రఘువిశ్వంత్ (జెడ్పీహెచ్‌ఎస్, బా దంపల్లి), నందిని (చింతగూడ, జన్నారం)విజేతలుగా ప్రకటించారు. డీఈవో యాదయ్య చే తుల మీదుగా నగదు పారితోషికం అందజేశా రు. కార్యక్రమంలో సోషల్ స్టడీస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, కార్యదర్శి మహేష్, సభ్యులు చక్రధర్‌రావు, లక్ష్మీనారాయణ, రాజన్న, మధుకర్, గోవర్ధనచారి, గురువయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment