వైకల్యాన్ని అధిగమించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: వైకల్యాన్ని అధిగమించి తాము ఎంచుకున్న రంగాల్లో విజయం సా ధించాలని అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నా రు. శనివారం లూయిస్ బ్రెయిలీ 216వ జ యంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావే శ మందిరంలో జిల్లా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ లూయి బ్రెయిలీ అంధుల కు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన అందించిన బ్రెయిలీ లిపి ద్వారా ఎంతో మంది అంధులు ఉన్నత స్థానాల్లో నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రవూఫ్‌ఖాన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, ఎఫ్‌ఆర్‌వో ఫర్జానా బేగం, డీసీపీవో ఆనంద్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment