జన్నారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం
జన్నారం: జన్నారం వ్యవసాయ మార్కెట్ కమి టీ నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా ధర్మారం గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్‌గా పొనకల్‌కు చెందిన సయ్యద్ ఫసీఉల్లా, డైరెక్టర్లుగా ఎల్ల లావణ్య, అంబటిపెల్లి నర్సయ్య, ముత్యం రాజన్న, బెడద సత్తయ్య, భీమనేని రాజన్న, లాకావత్ తిరుపతి, గర్వందుల సత్యగౌడ్, రేగుంట ప్రదీ ప్, పులిశెట్టి లావణ్య, పూసం సోనేరావుతో పా టు 16 మందిని సభ్యులుగా నియమించారు. ఈనెల 5న ఆదివారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నారు
Comments
Please login to add a commentAdd a comment