స్పెషల్ పార్టీ పోలీసులకు గ్రేహౌండ్స్ శిక్షణ
మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న స్పెషల్ పార్టీ (సాయుధ పోలీస్ బలగాలు) పోలీస్ సిబ్బందికి శనివారం గ్రేహౌండ్స్ తరహాలో శిక్షణ కార్యక్రమాన్ని సీపీ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేహౌండ్స్ సిబ్బంది వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు, నక్సలైట్ల ఏరివేతకు సంసిద్ధులై ఉండేలా తయారు చేస్తున్నామన్నారు. కమిషనరే ట్ పరిధిలో అదే తరహాలో ఏర్పాటైన స్పెషల్ టీమ్ (క్యూఆర్‌టీ) క్యూక్ రెస్పాన్స్ టీమ్‌కు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. అడిషనల్ డీసీపీ రాజు, ఏఆర్‌ఏసీపీ ప్రతాప్, సుందర్‌రావు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.
నిందితులకు శిక్షపడేలా కృషిచేయాలి
మంచిర్యాలక్రైం: కోర్టు కానిస్టేబుళ్లు, లైసన్ ఆఫీసర్లు నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్ ఆవరణలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని పోలీస్ స్టేషన్‌లో కోర్టు డ్యూటీ చేస్తున్న కానిస్టేబుళ్లు, లైసన్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. అడిషనల్ డీసీపీ రాజు, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏసీపీ ప్రతాప్, లీగల్ సెల్ సీఐ కృష్ణ, సీసీఆర్‌బీ సీఐ సతీష్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ గన్
మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్‌గన్‌ను ఉపయోగిస్తున్నట్లు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. కమిషనరేట్ పరిధి లోని జాతీయ రహదారిపై స్పీడ్ గన్‌తో నిరంతర నిఘా కొనసాగుతోందన్నారు. గతేడాది కమిషనరేట్ పరిధిలో స్పీడ్ గన్ ద్వారా 7,047 కేసులు నమోదు కాగా రూ. 72,77,445 జరిమానా విధించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment