మూడేళ్లలో అభివృద్ధి పనులన్నీ పూర్తి
● ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాలటౌన్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని, మూడేళ్లలోపు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్డులో ని ర్మిస్తున్న వైకుంఠధామం, మంచిర్యాల మార్కెట్‌లో ని రోడ్డు వెడల్పు పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. వైకుంఠధామం పనులు యుద్ధప్రాతిపదిక న జరుగుతున్నాయని, శివరాత్రిలోగా పూర్తి చేస్తామన్నారు. రాళ్లవాగుకు ఇరువైపులా కరకట్ట నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్నామని, ఆరునెలల తరువాత వ్యాపార కూడళ్ల రూపురేఖలు మారుతాయన్నారు. మంచిర్యాల కార్పొరేషన్‌గా మారితే అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతామన్నారు. తన ఆరోగ్యంపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు. కాలుకు చిన్న ఆపరేషన్ జరిగిందని, ప్రత్యర్థులు దానిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ప్రజల ఆశీస్సులతో తాను సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేశ్, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment