బ్యాటరీల చోరీ నిందితుల అరెస్టు
బెల్లంపల్లి: రైల్వే శాఖకు చెందిన ఎలక్ట్రికల్ బ్యాకప్ బ్యాటరీల చోరీ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. శనివారం బెల్లంపల్లి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌ఫీఎఫ్) పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రామగుండం ఆర్‌ఫీఎఫ్ సీఐ బుర్ర సురేష్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. తాండూర్ మండలం రేచీనీ రోడ్–ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్‌ల మధ్య ఉన్న రేపల్లేవాడ శివారు రైల్వే ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు బ్యాకప్ బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. బెల్లంపల్లి, రామగుండం ఆర్‌పీఎఫ్ ఎస్సైలు నరేందర్, క్రాంతికుమార్, హెడ్ కానిస్టేబుల్ ఐలయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. తాండూర్ మండలం కిష్టంపేటకు చెందిన మోటం శ్రీను, టి.మహేష్‌ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 55 బ్యాటరీలు, ఓమినీ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment