వసంత పంచమి వేడుకలు షురూ
భైంసా: చదువుల తల్లి కొలువైన బాసరలో శనివారం వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ వైదికబృందం ఆధ్వర్యంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గోమాతకు పూజలు చేశారు. అనంతరం యాగశాలలో హోమపూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. సరస్వతీ, మహాలక్ష్మీ అమ్మవార్లకు పూజలు చేశారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
భక్తుల పూజలు
బాసర వచ్చిన భక్తులు ముందుగా గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి సూర్యేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు చేయించి సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, గోదావరి ఘాట్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉత్సవాలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment