సింగరేణి కార్మికులకు ఊరట
శ్రీరాంపూర్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సింగరేణి కార్మికులకు కాస్త ఊరటనిచ్చింది. ఆదాయ పన్ను స్లాబ్ పెరుగుదల కార్మికులకు ఆర్థికంగా మేలు చేయనుంది. రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకపోవడంతో జూనియర్ కార్మికులకు మేలు జరుగనుంది. ఇటీవల సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు, ఎక్స్‌ట్రనల్ నోటిఫికేషన్ల ద్వారా వేలాది మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. వీరంతా కూడా రూ.4 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం పొందుతారు. పాత ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం రూ.6 లక్షలు దాటిన వారు కూడా ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉండేది. కానీ నేడు ఈ బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు కూడా పన్ను లేకపోవడంతో కార్మికులకు ఆర్థికంగా మేలు జరుగనుంది. దీని వల్ల కంపెనీ వ్యాప్తంగా సుమారు 15 వేల మంది కార్మికులకు మేలు జరుగనుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే బొగ్గు పరిశ్రమను రిస్క్ సెక్టార్‌గా గుర్తించి ఆదాయ పన్ను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రతీ ఎన్నికలకు ముందు ఇది ప్రచార అస్త్రంగా నిలుస్తోంది. ఈ సారైనా మాఫీ లేదా, మరింత ప్రత్యేక రాయితీ ఇస్తారని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలిందని పెదవి విరుస్తున్నారు.
ఆదాయపన్ను స్లాబ్ పెరుగుదలతో మేలు
మాపీపై మరో‘సారీ’
Comments
Please login to add a commentAdd a comment