![ప్రోత](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06adi25-340148_mr-1738868929-0.jpg.webp?itok=UJflaFQe)
ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!
● జాతీయస్థాయిలో మెరుస్తున్న క్రీడాకారులు ● అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటుతున్న ఆటగాళ్లు
బెస్ట్ రైడర్‌గా నిలిచా..
చిన్ననాటి నుంచి కబడ్డీ ఆడుతూ జాతీయ స్థాయిలో ఒకసారి ప్రాతినిధ్యం వహించాను. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఐదుసార్లు ఎంపికయ్యాను. గత సంవత్సరం నాగార్జునసాగర్‌లో జరిగిన అంతర్ జిల్లా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో బెస్ట్ రైడర్‌గా నిలిచాను. క్రీడాకారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
– జక్కుల రాజశేఖర్, నల్గొండ
నిత్యం ఆరోగ్యంగా..
క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరకంగా దృఢంగా ఉంటాం. తరుచూ కబడ్డీ ఆడడంతో నిత్యం ఆరోగ్యంగా ఉంటున్నాం. నిత్యం సాధన చేయడంతో క్రీడల్లో నైపుణ్యం పెరుగుతుంది. ఇప్పటివరకు 8 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నా. ఒక జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించాను. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను.
– శ్రీధర్, రంగారెడ్డి
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించా..
2009 నుంచి కబడ్డీ ఆడుతున్నాను. ఇప్పటివరకు ఐదు జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాను. 14 రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడాను. స్పోర్ట్స్ కోటాలో పోస్టల్ ఉద్యోగాన్ని సాధించాను. ఉద్యోగం చేస్తూనే జీవితాన్నిచ్చిన ఆటను మరవకుండా నిత్యం సాధన చేస్తూ టోర్నమెంట్లలో పాల్గొంటున్నా.
– జే. రాఘవేంద్ర రెడ్డి, రంగారెడ్డి
తరుచూ పోటీలు నిర్వహించాలి
కబడ్డీ ఆటకు రోజురోజుకూ ప్రాచుర్యం పెరుగుతోంది. పాఠశాల స్థాయి, సీనియర్ స్థాయిలో ఆడుతున్నాను. ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ పోటీలు లేకపోతే ఆట నైపుణ్యాలు మరుగున పడిపోతాయి. ఎప్పటికప్పుడు అసోసియేషన్ల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు నిర్వహించాలి. – సందీప్, నాగర్‌కర్నూల్
నిత్యం సాధన చేస్తుంటాం..
ఎక్కడ పోటీలు ఉన్నా ప్రాతినిధ్యం వహించడానికి ముందుకు వస్తాం. ఇప్పటివరకు ఒక జూనియర్ నేషనల్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించాను అదేవిధంగా మూడు రాష్ట్రస్థాయి పోటీల్లో మా జిల్లా తరఫున ఆడాను. ప్రతీరోజు నాలుగు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తాం. మా జట్టులో ఎంతోమంది రాష్ట్రస్థాయి క్రీడాకారులు ఉన్నారు. వారిలో నైపుణ్యాలు పెంపొందించేలా ప్రత్యేక శిక్షకులను నియమించాలి.
– జాఫర్ మియా, నాగర్‌కర్నూల్
కబడ్డీ క్రీడలో పలువురు క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తున్నారు. నిత్యం సాధన చేస్తూ, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతూ ఔరా అనిపిస్తున్నారు. అలాంటి క్రీడాకారులకు మరింత శిక్షణ ఇస్తే గొప్ప క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉంది. జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చారు. జాతీయ, రాష్ట్రస్థాయి వేదికల్లో ప్రతిభ కనబరిచిన పలువురు క్రీడాకారుల మనోగతం.. – ఆదిలాబాద్
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న 71వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు గురువారం మూడోరోజుకు చేరుకున్నాయి. వివిధ జిల్లాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొత్తం 8 జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. శుక్రవారం సాయంత్రం క్వార్టర్ ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్లు సెమీస్‌లో ఆడనున్నాయి. సెమీస్‌లో గెలుపొందిన జట్లు అదేరోజు రాత్రి ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతాయి.
విజేత జట్లు ఇవే..
గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నల్గొండ జట్టు హన్మకొండ జట్టుపై 43 –20 తేడాతో విజయం సాధించింది. గద్వాల్ జట్టు సంగా రెడ్డిపై 36 –26 తేడాతో, నాగర్‌కర్నూర్ జట్టు యాదాద్రిభువనగిరిపై 43 –41 తేడాతో, వనపర్తి జట్టు కరీంనగర్‌పై 41 –29 తేడాతో, సూర్యపే ట జట్టు భద్రాద్రి కొత్తగూడెంపై 33 –13 తేడాతో, నిజామాబాద్ జట్టు జనగాంపై 42 –34 తే డాతో, రంగారెడ్డి జట్టు మేడ్చల్‌పై 40 –36 తేడాతో, హైదరాబాద్–2 జట్టు హైదరాబాద్ 1పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. గెలు పొందిన జట్లు శుక్రవారం తలపడనున్నాయి.
మూడోరోజుకు అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు
![ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06adi31-340148_mr-1738868929-1.jpg)
ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!
![ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06adi29-340148_mr-1738868929-2.jpg)
ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!
![ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!3](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06adi26-340148_mr-1738868929-3.jpg)
ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!
![ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!4](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06adi30-340148_mr-1738868929-4.jpg)
ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!
![ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!5](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06adi27-340148_mr-1738868930-5.jpg)
ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!
![ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!6](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06adi28-340148_mr-1738868930-6.jpg)
ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!
Comments
Please login to add a commentAdd a comment