![రేషన్‌షాప్ సీజ్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mcl81-340059_mr-1738868931-0.jpg.webp?itok=aKmITwhh)
రేషన్‌షాప్ సీజ్
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో గల రేషన్ షాపు నంబర్ 15ను రెవెన్యూ అధికారులు గురువారం సీజ్ చేశారు. రేషన్ షాపులో కోటా కంటే అధికంగా బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం అందుకున్న తహసీల్దార్ రఫతుల్లా హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ మధుసూదన్, ఎంఆర్‌ఐ అజీజ్, స్వప్న, సీనియర్ అసిస్టెంట్ సంజీవ్‌లు షాపును తనిఖీ చేయగా, కోటా కంటే 9 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉండడంతో షాప్‌ను సీజ్ చేసి, షాపు డీలర్ గద్దల వెంకటస్వామిపై కేసు నమోదు చేశారు.
లారీ డ్రైవర్‌కు ఏడాది జైలుశిక్ష
మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు మంచిర్యాల జూనియర్ సివిల్ జడ్జి, సెకండ్ అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కే. నిరోష ఏడాది జైలుశిక్ష విధించినట్లు మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం హాజీపూర్ మండలం సబ్బపల్లి గ్రామానికి చెందిన రెబ్బ రాజలింగు అతని కుమారుడు రెబ్బ అంజయ్యలు కలిసి 2022 మార్చి 27న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మంచిర్యాల ఐబీ చౌరస్తాలోకి రాగానే వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన తన కుమారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతుడి తండ్రి రాజలింగు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కిరణ్‌కుమార్ కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా విచారణలో భాగంగా అదనపు ప్రాసిక్యూటర్ రవీందర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి విచారించగా నేరం రుజువైనందున లారీ డ్రైవర్ దూటె ప్రవీణ్‌సురేశ్‌కు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment