కోలిండియా క్యారమ్స్ పోటీల్లో పతకాలు
శ్రీరాంపూర్: కోలిండియా క్యారమ్స్ పోటీల్లో సింగరేణి క్రీడాకారులు పలు పతకాలు సాధించారు. ఈ నెల 3 నుంచి 5 వరకు జార్ఖండ్ రాజధాని రాంచీలో కోలిండియా క్యారమ్స్ పోటీలు జరిగాయి. ఇందులో టీం చాంపియన్‌గా సింగరేణి క్యారమ్స్ జట్టు నిలిచింది. ఆర్. సృజన్‌రావు(జనరల్ మజ్ధూర్, ఆర్కే 6, ఎస్సార్పీ), తాజోద్దీన్ (ఆఫీస్ అసిస్టెంట్, శ్రీరాంపూర్ ఓసీపీ), ఓ. మల్లేశ్ (జనరల్ మజ్ధూర్, కై రిగూడ ఓసీపీ, బెల్లంపల్లి), బీ. శ్రీనివాస్ (హెచ్‌వోఎం, కేటీకే 1, భూపాలపల్లి), వి. వెంకటస్వామి (కేటీకే 8, భూపాలపల్లి)లు టీం చాంపియన్‌షిప్ సాధించారు. ఆర్. సృజన్‌రావు సింగిల్స్‌లో ప్రథమ స్థానం, డబుల్స్‌లో ఓ. మల్లేశ్, బీ. శ్రీనివాస్‌లు ద్వితీయ స్థానం సాధించారు. కోలిండియా పోటీల్లో పతకాలు సాధించి సింగరేణి ఖ్యాతి చాటినందుకు క్రీడాకారులను ఏరియా అధికారులు, క్రీడాకారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment