రిక్రూట్‌మెంట్‌ ఫౌండేషన్‌ కోర్సులకు ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

రిక్రూట్‌మెంట్‌ ఫౌండేషన్‌ కోర్సులకు ఉచిత శిక్షణ

Published Fri, Feb 7 2025 12:43 AM | Last Updated on Fri, Feb 7 2025 12:43 AM

-

మంచిర్యాలటౌన్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ ఫౌండేషన్‌ కోర్సులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శా ఖ అధికారి ఎ.పురుషోత్తం, బీసీ స్టడీ సర్కిల్‌, ఆది లాబాద్‌ సంచాలకులు జి. ప్రవీణ్‌ కుమార్‌లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 4 నెలల ఉచిత శిక్షణ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు బుక్‌ ఫండ్‌తో పాటు ప్రతీ నెల స్టైఫండ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలలోపు ఉండాలని, అభ్యర్థుల ఎంపిక విధానం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుందని తెలి పారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 9వ తేదీలోగా ఆన్‌లైన్‌లో www. tgbcstudycircle. cgg. gov. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకో వాలని, ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. వివరాలకు 08732–221280లో సంప్రదించవచ్చన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement