![నాగోబా ఆదాయం @ రూ.21.08 లక్షలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06knp130-340041_mr-1738868931-0.jpg.webp?itok=j1NGYbo2)
నాగోబా ఆదాయం @ రూ.21.08 లక్షలు
ఇంద్రవెల్లి(ఖానాపూర్): పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని జనవరి 28 నుంచి నిర్వహించిన నాగోబా జాతరకు రూ.21,08,520 లక్షల ఆదా యం వచ్చిందని ఆలయ ఈవో మెండి రాజమౌళి తెలిపారు. గురువారం నాగోబా ఆలయంలో మె స్రం వంశీయులు, ఆలయకమిటీ ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. తైబజార్ ద్వారా రూ. 11,36,843, హుండీ ద్వారా రూ.9,71,677 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్‌రావ్, మెస్రం వంశీయులు చిన్ను పటేల్, కోసేరావ్, దాదారావ్, తిరుపతి, నాగ్‌నాథ్, మెస్రం వంశ ఉద్యోగులు సోనేరావ్, దేవ్‌రావ్, శేఖర్‌బాబు పాల్గొన్నారు.
నగదు పట్టివేత
తానూరు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని బెల్‌తరోడా సరిహద్దులో గురువారం పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రూ.1.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని భోకర్ నుంచి భోసి గ్రామానికి వెళ్తున్న ఓ వాహనాన్ని తనిఖీ చేసి నగదు స్వాధీనం చేసునకున్నామన్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
నిర్మల్‌టౌన్: మద్యం తాగొద్దని కుమారులు చెప్పడంతో కోపంతో చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక కూరన్నపేట్ కాలనీకి చెందిన దాసరి భూమన్న (65) ఎక్కువగా మద్యం సేవించేవాడు. అతని ఇద్దరు కుమారులు మద్యం తాగడం బంద్ చేయాలని సూచించగా కోపంతో సోమవారం ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయాడు. పెద్ద కుమారుడు రమణ ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గురువారం బంగల్‌పేట్ చెరువులో మృతదేహం కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలా నికి చేరుకున్న ఎస్సై శ్రీకాంత్ మృతదేహం దా సరి భూమన్నదిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment