డయాగ్నోస్టిక్ సెంటర్ సీజ్
ఇచ్చోడ: మండల కేంద్రంలో అనుమతి లేని డయాగ్నోస్టిక్ సెంటర్‌ను జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ గురువారం సాయంత్రం సీజ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా, అర్హత లేని వారు డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వహిస్తున్నందున సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని డయాగ్నోస్టిక్ సెంటర్లను సీజ్ చేస్తామని పేర్కొన్నారు.
పుస్తెలతాడు దొంగతనానికి విఫలయత్నం
ఆదిలాబాద్‌టౌన్: మహిళ మెడలోని పుస్తెలతాడును దొంగిలించేందుకు ఓ దుండగుడు విఫలయత్నం చేసిన ఘటన గురువారం రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్‌కు చెందిన విజయలక్ష్మి బంధువులు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా కుమారుడితో కలిసి పరామర్శించేందుకు వెళ్లింది. మూడో అంతస్తులోకి వెళ్లి మెట్ల మార్గం ద్వారా కింది ఫ్లోర్‌కు వస్తున్న క్రమంలో ఓ దుండగుడు ఆమె మెడలోని పుస్తెలతాడును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. సదరు మహిళతో పాటు ఆమె కుమారుడు అరవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన సెక్యూరిటీ గార్డు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసులు విచారించగా ఇంద్రవెల్లి మండలంలోని ఏమైకుంట గ్రామానికి చెందిన ముండే శ్రీకాంత్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. కాగా దుండగుడిని పట్టుకున్న రిమ్స్ సెక్యూరిటీ గార్డులు నరేశ్, అమీర్, చందు, హనుమాన్లు, అంకుష్‌లను డీఎస్పీ అభినందించారు.
పిచ్చికుక్కల వీరంగం
కోటపల్లి: మండలంలోని అన్నారం గ్రామంలో గురువారం పిచ్చికుక్కలు వీరంగం సృష్టించాయి. ఒక ఉపాధ్యాయుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చడంతో స్థానికులు భ యాందోళన చెందుతున్నారు. అన్నారంలో ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడిచేసేందుకు ప్రయత్నించాయి. వారిని కాపాడేందుకు ఉపాధ్యాయు డు చూడగా పిచ్చికుక్కలు ఉపాధ్యాయుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చినట్లు స్థా నికులు తెలిపారు. గ్రామంలో పిచ్చికుక్కల దాడిలో చాలామంది గాయపడుతున్నా అఽ దికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మామడ: మండలంలోని దిమ్మదుర్తి గ్రామం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖానాపూర్ మండలంలోని సూర్జాపూర్ గ్రామానికి చెందిన పన్నెల భీమేశ్వర్ (56) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమేశ్వర్ నిర్మల్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఖానాపూర్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో భీమేశ్వర్ తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. భీమేశ్వర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై సందీప్ సందర్శించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment