జన్నారం: అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి నేతకాని కులం జనాభా 1,33,072 మాత్రమే అని ప్రకటన చేసి నేతకాని జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి రాజేశ్వర్, మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి గంగాధర్, జన్నారం మండల అధ్యక్షుడు రత్నం లక్ష్మణ్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగా ణలోని గోదావరి పరీవాహక ప్రాంతం ఖమ్మం నుంచి నిజామాబాద్ వరకు సుమారు 18 లక్షల నేతకా ని జనాభా ఉందన్నారు. ప్రభుత్వం పునరా లోచించి నేతకాని కులస్తులకు న్యాయం చేయాలని డి మాండ్ చేశారు. సంఘం రాష్ట్ర నాయకులు ప్రభుదా స్, వెంకట్, లక్ష్మణ్, రవి శంకర్, మల్లయ్య, నంద య్య, దత్తు ప్రేమ్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment