భీమారం: ఇంటి తాళం పగులగొట్టి చోరీ చేసిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీడీఏ కాలనీకి చెందిన రాంటెంటి రంజిత్‌కుమార్ జనవరి 31న తన కుమారుడి అక్షరాభ్యాసం కోసం కుటుంబంతో కలిసి సిద్దిపేట జిల్లాలోని శనిగరం వెళ్లాడు. ఫిబ్రవరి 5న ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువా లాకర్ పగులగొట్టి రూ. 50 వేల నగదు, రూ.42 వేలు విలువ చేసే బంగా రం ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలాన్ని సీఐ వేణుచందర్ సందర్శించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని ఎస్సై గురువారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment