‘అక్రమ’ దారి.. హత్యకు సుపారీ!
● కారులో కత్తితో పొడిచి.. ● వారం రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు ● వీడిన మమత హత్య కేసు మిస్టరీ
చొప్పదండి: అక్రమ సంబంధం, జల్సా జీవితం ఓ మహిళ ప్రాణం తీసింది. భర్తను వదిలేసి, నాలుగేళ్ల బాబుతో కలిసి ఓ యువకుడితో సహజీవనం.. అతడి కుటుంబ సభ్యులకు కంటగింపుగా మారి, మహిళను అంతమొందించేందుకు దారితీసింది. మంచిర్యాల జిల్లాలో జరిగిన రూ.5 లక్షల సుపారీ హత్య, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల శివారులోని కాలువ వద్ద దొరికిన మహిళ మృతదేహంతో బయటకు వచ్చింది. గురువారం చొప్పదండి సీఐ ప్రకాశ్‌గౌడ్, ఎస్సై నరేందర్‌రెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు.
భర్తను వదిలేసి ..
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన కలు మల్ల భాస్కర్ సింగరేణిలో ఉద్యోగి. అతడికి కాసిపేట గ్రామానికి చెందిన మేడ మమత(25)తో పరి చయం ఏర్పడింది. మమతకు భర్తతో మనస్పర్థలు రావడంతో అతడిని వదిలి నాలుగేళ్ల కుమారుడు ధృవతో కలిసి మంచిర్యాలలోని తిలక్‌నగర్‌లో ఉంటూ క్యాటరింగ్ పనులు చేసేది. భాస్కర్ జీతం డ బ్బంతా మమతకు ఖర్చు చేస్తుండడం.. ఇంట్లో ఇ వ్వకపోవడంతో భాస్కర్ కుటుంబ సభ్యులు ఆ మైపె కక్ష పెంచుకున్నారు. ఆమెను అంతం చేయాలని భాస్కర్ అక్క అవివాహిత కులుమల్ల నర్మద తన స్నేహితుడు గుంపుల రఘుతో కలిసి పథకం పన్నింది. ఇందుకు నర్మద అక్క భర్త బండ వెంకటేశ్, తండ్రి కులుమల్ల రాజలింగు సహకరించారు.
హత్య చేసి..
మమతను చంపాలని నర్మద రఘును కోరింది. రఘు లక్సెట్టిపేటలోని సుభాష్‌నగర్‌కు చెందిన వేల్పుల కళ్యాణ్‌ను సంప్రదించి మమత హత్యకు రూ.5లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో కళ్యాణ్ మమతను ఫోన్ చాటింగ్ ద్వారా ట్రాప్ చేశాడు. సుపారీలో భాగంగా అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.60 వేలు ఖర్చు చేస్తూ మమతకు దగ్గరయ్యా డు. జనవరి 25న సెల్ఫ్ డ్రైవింగ్ కారు కిరాయి తీసుకొని మమతను, ఆమె కుమారుడిని మంచిర్యాలలో ఎక్కించుకున్నాడు. మమతను పదునైన కత్తితో పొడిచి, నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. నర్మద, ఆమె కుటుంబ సభ్యులకు మృతదేహం చూపించి రూ.4 లక్షలు తీసుకొని అదే రోజు రాత్రి కారులో బయలుదేరాడు. గంగాధర మండలం కురిక్యాల రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేసి బాబును తీసుకొని హైదరాబాద్ పారిపోయాడు.
27న వెలుగులోకి..
కురిక్యాల శివారులో గుర్తు తెలియని మహిళా మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మమత అక్క ఉమాదేవి ఆమెను గుర్తించింది. 25న సాయంత్రం కుమారుడిని తీసుకొని షాపునకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగిరాలేదని తెలిపింది. మమత కుమారుడు ధృవ జాడ తెలియకపోవడంతో కేసు మిస్టరీగా మారింది.
సాంకేతిక పరిజ్ఞానంతో ..
మంచిర్యాలలోని ఓ బార్ వద్ద మమత కారు ఎక్కినట్లు పోలీసులు సీసీ పుటేజీలో గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా నిందితుడు కళ్యాణ్‌ను గుర్తుపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సీఐ ప్రకాశ్‌గౌడ్ బృందం చైన్నె వెళ్లారు. అక్కడి పోలీసుల సహకారంతో ఓ హోటల్‌లో బాబును రక్షించారు. ప్రస్తుతం బాబును మమత అత్తామామకు అప్పగించారు. పోలీసులను చూసి పారిపోయిన కళ్యాణ్‌ను ట్రేస్‌చేసి మళ్లీ పట్టుకున్నారు. కాంట్రాక్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు కళ్యాణ్‌తోపాటు, లక్సెట్టిపేట మండలం మిట్టపల్లికి చెందిన గుంపుల రఘు, నర్మద, జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేటకు చెందిన బండ వెంకటేశ్, కులుమల్ల రాజలింగును రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్సై నరేందర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ జంపయ్య, శ్రీధర్, ఐటీ సెల్ కానిస్టేబుల్స్ ప్రదీప్, మహేందర్‌ను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment