![ఎమ్మెల్సీ ఎన్నికలకు 15 నామినేషన్లు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06knt404-604887_mr-1738868931-0.jpg.webp?itok=qVkNJV_h)
ఎమ్మెల్సీ ఎన్నికలకు 15 నామినేషన్లు
● గ్రాడ్యుయేట్ స్థానానికి 12
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 3 దాఖలు
కరీంనగర్ అర్బన్: మెదక్–నిజామాబాద్–కరీంనగర్–ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గురువారం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది నామినేషన్ వేయగా టీచర్స్ ఎమ్మెల్సీకి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. పట్టభద్రుల స్థానానికి సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన లంటు చంద్రశేఖర్, కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన యాదగిరి శేఖర్‌రావు తరఫున పచ్చునూరి సురేందర్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మేకల అక్షయ్ కుమార్, నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్‌కు చెందిన అబ్బగోని అశోక్ గౌడ్, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన దేవతి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పెరుందేవి గూడేనికి రైకల సైదులు, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన గుయ్య సాయికృష్ణమూర్తి, కరీంనగర్ నగరానికి చెందిన ఎడ్ల సాయి కృష్ణప్రియ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్లు దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దొడ్ల వెంకటేశం, మంచిర్యాల జిల్లా తిరుమలగిరి కాలనీకి చెందిన కొమిరెడ్డి మహేశ్, నిజామాబాద్‌కు చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కొసునూరుపల్లికి చెందిన వేముల విక్రమ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీస్థానానికి మెదక్ జిల్లా టేకుమల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన మామిడి సుధాకర్‌రెడ్డి, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన మల్కా కొమురయ్య, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం న్యూ మల్కాపూర్‌కు చెందిన వై.అశోక్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఇదివరకే నామినేషన్ వేసిన ఆదిలాబాద్ జిల్లా యాపల్‌గూడకు చెందిన మంచి కట్ల ఆశమ్మ మరో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇదివరకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిన మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడేనికి చెందిన కంటె సాయన్న మరో సెట్ సమర్పించారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి ఇదివరకే నామినేషన్ దాఖలు చేసిన కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరి శ్రీకాంత్ మరో సెట్ నామినేషన్ అందజేశారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి ఇప్పటివరకు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు కలిపి మొత్తం 28మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో 21 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి, ఏడుగురు టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment