ఇందిరా హయాంలోనే ప్రగతి | Sakshi
Sakshi News home page

ఇందిరా హయాంలోనే ప్రగతి

Published Thu, May 9 2024 10:25 AM

ఇందిరా హయాంలోనే ప్రగతి

నర్సాపూర్‌ రూరల్‌: ఇందిరాగాంధీ వల్లే మెదక్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 9న నర్సాపూర్‌కు రాహుల్‌గాంధీ వస్తున్న సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెదక్‌ ప్రజల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఉపాధి కల్పించిందని కొనియాడారు. అలాగే వైఎస్సార్‌ హయాంలో అభివృద్ధి జరిగిందన్నారు. సొంత జిల్లా ప్రగతికి కేసీఆర్‌, హరీశ్‌రావు ఏ మాత్రం కృషి చేయలేదని విమర్శించారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్న కాలంలో కేసీఆర్‌కు దోచిపెట్టి రూ. కోట్లు సంపాదించారని ఆరోపించారు. రఘునందన్‌రావు జిల్లా అభివృద్ధికి నయా పైసా తీసుకురాలేదన్నారు. రాహుల్‌గాంధీ రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా నలుమూలల నుంచి 50 వేలకు పైగా ప్రజలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్‌, చెంగనూర్‌ ఎంపీ సురేష్‌, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, నాయకులు శ్రీనివాస్‌గుప్తా, మల్లేశ్‌, నగేశ్‌, మణిదీప్‌, నాయకులు పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖ

రాహుల్‌గాంధీ సభకు భారీ ఏర్పాట్లు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement