బాలికలకు ఎంత కష్టం! | - | Sakshi
Sakshi News home page

బాలికలకు ఎంత కష్టం!

Published Tue, Oct 1 2024 8:26 PM | Last Updated on Tue, Oct 1 2024 8:26 PM

బాలికలకు ఎంత కష్టం!

కౌడిపల్లి(నర్సాపూర్‌): బడిలో అన్ని సౌకర్యాలు ఉంటేనే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా వినగలుగుతారు.. అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడతాయి. అయితే బడిలో కనీస సౌకర్యా ల్లో ఒకటైన మరుగుదొడ్డి లేకపోతే? పిల్లలకు ఎంత ఇబ్బంది?.. ముఖ్యంగా బాలికలకై తే మరింత సమస్య.. మండలంలోని వెల్మకన్న ఉన్నత పాఠశాలలో 98 మంది విద్యార్థినులకు ఒకటే టాయిలెట్‌ ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇంటర్‌వెల్‌లో వరుసలో నిలబడి నిరీక్షిస్తూ అవస్థలు పడుతున్నారు. అత్యవసరం అయితే ఇంటికి వెలుతున్నారు. కొందరు నీరు తాగితే టాయిలెట్‌ వస్తుందని తాగడమే మానేశారు. ఇక బాలురు అయితే ఆరు బయటకు వెళ్తున్నారు. పాఠశాలలో 15 మంది ఉపాధ్యాయులు ఉండగా, ఇందులో ఆరుగురు మహిళా టీచర్లు ఉన్నారు. వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈవిషయమై హెచ్‌ఎం సరోజను వివరణ కోరగా ఒకే టాయిలెట్‌తో సమస్య ఉందని, జిల్లా అధికారులకు సమస్యను వివరించామని పేర్కొన్నారు.

98 మందికి ఒకటే మరుగుదొడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement