అర్జీలపై ప్రతీ వారం సమీక్ష
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణికి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. సో మవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందులో అత్యధికంగా భూ సమస్యలు ఉండగా, డబుల్‌బెడ్‌రూం, పెన్షన్లు, రుణమాఫీ వంటి వాటిపై ఎక్కువగా వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చి న వినతులపై ప్రతీ వారం సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉండాలని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల పర్యటనలో గుర్తించిన సమస్య ల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
రుణమాఫీ కాలేదు
పంట పెట్టుబడి కోసం బ్యాంకులో రూ. 20వేల రుణం తీసుకున్న. ఇప్పుడు అసలు, వడ్డీ కలిపి రూ. 70 వేలు అయిందని బ్యాంకు అధికారులు చెప్పారు. రుణమాఫీ కాకపోవడంతో నెల రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ఎందుకు కాలేదో చెప్తలేరు. రామాయంపేటకు బస్సు కిరాయి పెట్టుకొని తిరిగి తిరిగి అవస్థలు పడుతున్నా.
– రాజయ్య, తొనిగండ్ల, రామాయంపేట
ధరణితో భూమి పోయింది
అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లిలో ఎకరా ఆరు గుంటల భూమి ఉండేది. ఈ భూమి ధరణి వచ్చాక కనిపించకుండా పోయింది. 2003లో పట్టాదార్ పాస్ పుస్తకం సరిచేసేందుకు దరఖాస్తు అందజేశా. ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు. నా భూమి నాకు ఇప్పించగలరు.
– కిష్టయ్య, రెడ్డిపల్లి, అల్లాదుర్గం
కలెక్టర్ రాహుల్‌రాజ్
ప్రజావాణికి 87 వినతులు
Comments
Please login to add a commentAdd a comment