●డీఎస్సీ ఫలితాలు విడుదల ●ఈనెల 9న నియామక పత్రాల అందజేత ●
పాపన్నపేట(మెదక్): దసరా ధమాకాగా ప్రభుత్వం తీపి కబురు అందించింది. సోమవారం డీఎస్సీ ఫలితాలు విడుదల చేసింది. ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 9వ తేదీన నియామకపత్రాలు అందజేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జిల్లాలో మొత్తం 310 ఉపాధ్యాయ ఖాళీలుండగా, 1: 3 చొప్పున అభ్యర్థులను నేటి నుంచి సర్టిఫికెట్ల పరిశీల నకు పిలవనున్నట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. మెదక్‌లోని బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎస్జీటీలకు, 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఇతర కేడర్ ఉపాధ్యాయ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. కాగా జిల్లాలో ఎస్జీటీ టాపర్‌గా చిలప్‌చెడ్ మండలం రహీంగూడకు చెందిన జూల లింగం (78.87), ఎస్‌ఏ సోషల్ టాపర్‌గా కౌడిపల్లికి చెందిన గొల్ల శ్రీకాంత్ (78.33) ర్యాంకు సాధించారు.
2017 తర్వాత మెగా డీఎస్సీ..
2017 తర్వాత ప్రభుత్వం మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీని ఆగస్టు 13న విడుదల చేశారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. సెప్టెంబర్ 6న తుది కీ విడుదల చేశారు. చివరకు సోమవారం ఫలితాలు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 310 పోస్టులు ఉండగా, ఇందులో అత్యధికంగా ఎస్జీటీ 136 పోస్టులు ఉన్నాయి. లాంగ్వేజీ పండిత్ హిందీ 15, తెలుగు 13, ఉర్దూ 2, ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు 1, ఎస్‌ఏ (బయో) 18, ఉర్దూ 1, ఎస్‌ఏ ఇంగ్లీష్ 11, హిందీ 4, గణితం 17, ఉర్దూ 1, ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు 2, ఫిజికల్ సైన్స్ 7, ఉర్దూ 1, స్పెషల్ తెలుగు 9, ఎస్‌ఏ సోషల్ 24, ఉర్దూ 1, ఎస్‌ఏ తెలుగు 4, ఉర్దూ 1, ఎస్జీటీ స్పెషల్ తెలుగు 22, ఎస్జీటీ ఉర్దూ 20 పోస్టులు జిల్లాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment