ఎన్నికల హామీలు నెరవేర్చాలి
మెదక్ కలెక్టరేట్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ విమర్శించారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట టీచర్లతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. టీచర్ల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. సమస్యలపై దశలవారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ రిపోర్టు తెప్పించుకొని 60 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీపీఎఫ్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. 317 జీఓ విషయంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను బయటపెట్టాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, రామారావు, తపస్ మహిళా అధ్యక్షురాలు స్వరూపరాణి, మాధవి తదితరులు పాల్గొన్నారు.
తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్
Comments
Please login to add a commentAdd a comment