కొనుగోలులో ఇబ్బంది రావొద్దు
హవేళిఘణాపూర్(మెదక్): ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. రైతులకు ఇబ్బందులుంటే అక్కడికక్కడే పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 1,870 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం రవాణాలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ సింధూరేణుక, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment