దొంగతనాల నివారణకు చర్యలు
శివ్వంపేట(నర్సాపూర్): జిల్లాలో దొంగతనాల నివారణకు సీసీఎస్ టీం ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పలుచోట్ల వరు స దొంగతనాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గంజాయి రవాణా, అమ్మకాలపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైన వాటి ఆనవాళ్లు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వా లని ప్రజలకు సూచించారు. చిన్న చిన్న తగాదాలతో పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగవద్దన్నారు. గొడవలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరారు. శివ్వంపేటలో దంపతుల మిస్సింగ్‌ను త్వరలోనే ఛేదిస్తామన్నారు. అందుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌కు మూడు రోజుల్లో కొత్త ఎస్సైని నియమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ రంగకృష్ణ, ఇన్‌చార్జి ఎస్సై రాజు, తూప్రాన్ ఎస్సై శివానంద్, ఏఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment