సన్న, దొడ్డు వడ్లు వేర్వేరుగా కొనాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
నర్సాపూర్ రూరల్: సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని వేర్వేరుగా కొనుగోలు చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని ఎరక్రుంట తండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. తేమ శాతాన్ని పరిశీలించి ధాన్యా న్ని తూకం వేయాలన్నారు. తూకం వేసిన ధాన్యా న్ని రవాణా చేయాలని సూచించారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తుందన్నారు. కొనుగోలు సమాచారాన్ని ట్యాబ్‌లో పకడ్బందీగా ఎంట్రీ చేయాలన్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. కలెక్టర్ వెంట మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్‌ఐ సిద్ధరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిరంతరం రోగులకు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈసందర్భంగా హా జరు పట్టిక, మందుల వివరాలు, ఇతర రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆశావర్కర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment