డిసెంబర్ 14న లోక్ అదాలత్
మెదక్‌జోన్: డిసెంబర్ 14వ తేదీన జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద తెలిపారు. బుధవారం జిల్లా కోర్టు లో ఇందుకు సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించుకునే విధంగా న్యాయవాదులు సహకరించాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజ లు, కక్షిదారులు వినియోగించుకొని ఎక్కువ మొత్తంలో కేసులను రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌ఓగా బాధ్యతల స్వీకరణ
మెదక్ కలెక్టరేట్: మెదక్ డీఆర్‌ఓగా భుజంగరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం అద నపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి డీఆర్‌ఓను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా డీఆర్‌ఓ భుజంగరావు మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ జిల్లా డీఆర్‌ఓగా బదిలీపై వచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ సంబంధిత అంశాలను సమన్వయంతో పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
శాంతి భద్రతలకు
సహకరించాలి: ఎస్పీ
పెద్దశంకరంపేట(మెదక్): శాంతి భద్రతలకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేట పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. డిసెంబర్ 14వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్సై శంకర్, ఏఎస్‌ఐ విఠల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులకు నాణ్యమై న భోజనం అందించాలని ఇన్‌చార్జి డీఎల్‌పీఓ యాదయ్య అన్నారు. బుధవారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం, వంట గది, పరిసరాలను మండల అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు మెనూ ప్రకారం వంట చేసి పెట్టాలన్నారు. వంటగదితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సమస్యలుంటే తెలియజేయాలని సూచించారు. బా త్రూంలకు డోర్లు సరిగా లేవని కొత్తవి ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరిబాబు, ఎంపీడీఓ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ జహీర్, ఆర్‌ఐ శ్రీహరి, ఏపీఓ పుణ్యదాస్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
డేటా ఎంట్రీలో తప్పులు ఉండొద్దు
నిజాంపేట(మెదక్): మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని జెడ్పీ సీఈఒ ఎల్లయ్య పరిశీలించారు. ఎలాంటి తప్పులు లేకుండా సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సిబ్బందికి సూచించారు. ఆయనతో పాటు ఎంపీడీఓ రాజిరెడ్డి, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment