క్రీడలతో మానసికోల్లాసం
మెదక్‌జోన్: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. రాష్ట్రస్థాయి అండర్– 14 బాల, బాలికల షటిల్ బ్యాడ్మింటల్ పోటీలను పట్టణంలోని పీఎన్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొదటిసారిగా మెదక్ పట్టణంలో ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జాతీయస్థాయికి ఎంపికై న క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. నిర్వాహకులు రమే ష్, వినోద్ కుమార్‌ను అభినందించారు. కార్యక్రమంలో పీడీలు మాధవరెడ్డి, నాగరాజు, శ్రీనివాస్‌రావు, దాసరి మధు, సత్యరావు, దేవేందర్‌రెడ్డి, శ్యాం, మధుసూదన్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్
Comments
Please login to add a commentAdd a comment