నాణ్యతలో రాజీ పడొద్దు
● వారంలో సరికొత్త మెనూ ● కలెక్టర్ రాహుల్‌రాజ్ ● రామాయంపేట గురుకుల పాఠశాల తనిఖీ
రామాయంపేట(మెదక్): హాస్టళ్లు, స్కూళ్లకు సరఫరా అవుతున్న బియ్యం, సరుకులు నాణ్యతగా లేకపోతే తక్షణమే వాటిని మార్చాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. బుధవారం రామాయంపేట గురుకుల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. వారం రోజుల్లో సరికొత్త మెనూ అందుబాటులోకి వస్తుందన్నారు. జిల్లాలోని 105 రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలలు, వసతి గృహాలు, 897 ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణకు కమిటీలు వేస్తామని తెలిపారు. జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో రూ. 20 కోట్లతో మరమ్మతులు చేపట్టామని, అవసరమైన స్కూళ్లలో ఉపాధి నిధులతో కిచెన్ షెడ్లు నిర్మిస్తామన్నారు. శనివారం దీనిపై సంబంధిత అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కలెక్టర్‌తో పాటు తహసీల్దార్ రజనికుమారి, ఎంపీడీఓ సజీలుద్దీన్, ఐకేపీ ఏపీఎం రాములు, ఇతర అధికారులు ఉన్నారు.
రైతులను ఇబ్బంది పెడితే చర్యలు
ధాన్యం తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అక్కన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. త్వరితగతిన ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి అదే రోజు రవాణా చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు లక్షా 73 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment