మౌలిక వసతుల కల్పనకు కృషి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి
వెల్దుర్తి(తూప్రాన్)/చిన్నశంకరంపేట/శివ్వంపేట: గ్రంథాలయాలను యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి సూచించారు. బుధవారం వెల్దుర్తిలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని, మాసాయిపేటశాఖ గ్రంథాలయాన్ని పరిశీలించారు. నూతనంగా నిర్మించిన భవనంలో పాఠకులకు అవసరమైన మౌలిక వసతులను త్వరలో కల్పించి ప్రారంభించడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 15 శాఖ, ఒక జిల్లా గ్రంథాలయం ఉందన్నారు. 14 గ్రంథాలయాలకు పక్కా భవనాలు ఉండగా, రేగోడ్‌లో భవన నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. నిజాంపేట, మనోహరాబాద్, హవేళిఘనపూర్, చిలప్‌చెడ్ మండలాల్లో శాఖ గ్రంథా లయాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు నరేందర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నా రు. అనంతరం చిన్నశంకరంపేటలోని శాఖ గ్రంథాలయాన్ని తనిఖీ చేసి పుస్తకాలను పరిశీలించారు. తెలుగు, ఆంగ్ల పత్రికలు పాఠకులకు అందు బాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి పుస్తకాలు అందుబాటులో పుస్తకాలు ఉంచుతామని తెలిపా రు. అలాగే శివ్వంపేట గ్రంథాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment