ఆయిల్‌పామ్‌తో అధిక దిగుబడి
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ప్రతాప్‌సింగ్
తూప్రాన్: ఆయిల్‌పామ్ సాగుతో అధిక దిగుబడు లు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి ప్రతాప్‌సింగ్ అన్నారు. గురువారం పట్టణంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ పంట సాగు చేయాలని సూచించారు. ఎకరా వరికి సరిపోయే నీటితో ఐదెకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయవచ్చని వివరించారు. జిల్లాలో 2023– 24లో 78 మంది రైతులు 336 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారని తెలిపారు. 2024– 25కు సంబంధించి ఇప్పటివరకు 1,623 ఎకరాలకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి కృష్ణ, ఉద్యానశాఖ అధికారి రచన, ఏఓ గంగుమల్లు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment