డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
వెల్దుర్తి(తూప్రాన్)/చిన్నశంకరంపేట/శివ్వంపేట: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చ ర్యలు తీసుకుంటూనే డ్రగ్స్, గంజాయి రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. గంజాయి రవాణాను జిల్లా లో పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడైనా సరఫరా జరుగుతున్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు. వెల్దుర్తి ఉమ్మడి మండలంలో అనుమతి లేకుండా మట్టి, ఇసుక రవాణా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అనంతరం చిన్నశంకరంపేట, శివ్వంపేట పోలీస్‌స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు తనిఖీ చేశారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎస్పీ వెంట తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment