అమిత్‌షా క్షమాపణ చెప్పాలి
కొల్చారం(నర్సాపూర్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని రంగంపేటలో గురువారం ధర్నా నిర్వహించారు. మెదక్– సంగారెడ్డి రహదారిపై రహదారిపై బైఠాయించి అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కొల్చారం పోలీసులు నాయకులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. అమిత్‌షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment