పత్తి రైతులను ఆదుకోండి
కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌కు ఎంపీ షెట్కార్ వినతి
నారాయణఖేడ్: పత్తి పంటకు సరైన మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఎంపీ సురేశ్ షెట్కార్ కేంద్ర జాళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ను కోరారు. ఈ ఏడాది పత్తికి రూ.7,521 ప్రకటించినా రైతులకు మాత్రం దక్కడం లేదన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలను వివరిస్తూ కేంద్రమంత్రికి గురువారం షెట్కార్ వినతిపత్రం అందించారు. వాతావరణంలో నెలకొన్న మార్పుల వల్ల అధిక తేమను సాకుగా చూపి కొనుగోలు దారులు రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే రూ.100 నుంచి 200ల వరకు తక్కువగా చెల్లిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలతో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అధికశాతం రైతులు సీసీఐకి పత్తిని విక్రయించారని, అందువల్ల రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment