మహిళలకు రూ. 29 కోట్ల రుణాలు
డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాస్‌రావు
కౌడిపల్లి(నర్సాపూర్): డ్వాక్రా మహిళలకు ఈ ఏడాది రూ. 29.95 కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నామని డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాస్‌రావు తెలిపారు. గురువారం కౌడిపల్లి ఐకేపీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా రుణాలు, రికవరీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు ద్వారా రూ. 28.28 కోట్ల రుణాలు లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ. 22.70 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. సీ్త్రనిధి ద్వారా రూ.1.67 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ. 1.17 కోట్లు ఇచ్చామన్నారు. మిగితా రుణాలు సైతం ఈనెలాఖరు వరకు పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకుంటామని వివరించారు. మహిళలకు జీవనోపాధి కల్పించి సుస్థిర ఆదాయం వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తీసుకున్న రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం సంగమేశ్వర్, సీసీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment