శత వసంతానికి.. సీఎస్‌ఐ సిద్ధం
బుధవారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
శతాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్న సీఎం
● ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి ● 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు
గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం నిర్లక్ష్యం
యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి
మెదక్ కలెక్టరేట్: గత ప్రభుత్వం విద్యారంగాన్ని చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే నిధులు పెంచాల్సిన అవసరం ఉందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీఓ భవన్‌లో టీఎస్‌యూటీఎఫ్ నిజామాబాద్ జిల్లా 6వ మహాసభ జరిగింది. కార్యక్రమానికి చావ రవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. యేటా ఒక్కో శాతం బడ్జెట్‌ను తగ్గిస్తూ తొమ్మిది సంవత్సరాల్లో 14 శాతం నుంచి 6 శాతానికి తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పిందన్నారు. కానీ బడ్జెట్‌లో కేవలం 7 శాతం మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి , శ్రీనివాసరావు, పద్మారావు, రవీందర్ రెడ్డి, కవిత, అజయ్ కుమార్, సుధాకర్, నగేశ్, రవి, శేఖర్, నాగుల్ మీరా, యేసయ్య, అశోక్, భూషణం, ప్రేమ్ కుమార్, షాకిర్ అలీ, నరసింహులు పాల్గొన్నారు.
విద్యుత్ కాంతుల్లో సీఎస్‌ఐ చర్చి
మెదక్‌జోన్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మెదక్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చిని నిర్మించి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహించనున్న శతాబ్ది ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయనునట్లు ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వందలాది సీసీ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నారు. అలాగే వాహనాలను అంబేడ్కర్ సర్కిల్ ప్రాంతంలో, చర్చి సెకండ్ గేట్ లోపల, జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో, బోధన్ చౌరస్తా ప్రాంతంలోని చర్చిగ్రౌండ్‌లో, మాయా గార్డెన్ సమీపంలో, రూరల్ పోలీస్‌స్టేషన్ సమీపంలో వాహనాలు పార్కింగ్ కోసం కేటాయించారు.
తెల్లవారుజామున 4.30లకు ప్రారంభం ఆరాధన
క్రిస్మస్ వేడుకలు బుధవారం తెల్లవారుజామున 4.30 గంలకు మొదటి ఆరాధన ప్రారంభమవుతోంది. ఇన్‌చార్జి బిషప్ రెవరెండ్ డాక్టర్ రూబెన్‌మార్క్ ప్రారంభిస్తారు. ఇందులో సుమారు ఏడు వేల మంది భక్తులతో ఘనంగా ప్రారంభం కానుంది. అనంతరం 2వ, ఆరాధన 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాలకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు దేశ విదేశాల నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 20 మంది గురువులను ఏర్పాటు చేయనునట్లు చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి శాంతయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment