ఏడుపాయలలో భారీ ఏర్పాట్లు
● ఐజీ, సీఎంఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పరిశీలన
పాపన్నపేట(మెదక్): ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏడుపాయల వనం పోలీసుల ఆధీనంలోకి వెళ్లింది. పోలీసులు భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎంఓ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ ప్రకాశ్, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కొల్చారం వైపు(టేకులగడ్డ) వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు. అనంతరం దేవాలయ ప్రాంగణాన్ని చూసి కొన్ని సూచనలు చేశారు. వివిధ శాఖల అధికారులు అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
రూ. 297.76 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
మెదక్ జిల్లాలో రూ.297.76 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఏడుపాయల్లో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా పొడిచన్‌పల్లి కమాన్ నుంచి ఏడుపాయల టెంపుల్ వరకు రూ.35 కోట్లతో వేయనున్న డబుల్ రోడ్డు ,రూ.5 కోట్లతో నిర్మింనున్న సీ్త్ర శక్తి భవన్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆర్ అండ్ బీ శాఖ ద్వారా జిల్లాలోని వివిధ గిరిజన తండాలకు రూ.52.76 కోట్లతో రోడ్లు వేస్తారు. టీజీఈడబ్ల్యూ ఐడీసీ నుంచి రామాయంపేటలో రూ. 205 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేస్తారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా
సీఎం ఉదయం 10.45కు బేగంపేట నుంచి హెలిక్యాప్టర్‌లో
బయలుదేరి 11గంటలకు ఘనపురం చేరుకుంటారు.
11.05కు ఏడుపాయల, 11.30 వరకు దుర్గమ్మ దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు.
11.30 – 11.40 వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.
11.45 ఏడుపాయల నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి మెదక్.
మధ్యాహ్నం 12 నుంచి 12.25 వరకు చర్చిలో
అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
12.25కు పోలీస్ హెడ్ క్వార్టర్ వెళ్లి 12.40కి హైదరాబాద్‌కు బయలు దేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment