క్రీస్తు మార్గం అనుసరణీయం
ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి
మెదక్ కలెక్టరేట్: క్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను సంతోషంగా, ఆహ్లాదకర వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించారు. క్రిస్మస్ పండుగ త్యాగానికి, ప్రేమ, కరుణకు తార్కాణంగా జరుపుకొంటారని పేర్కొన్నారు. మానవత్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగిరం చేయండి
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య
చేగుంట (తూప్రాన్): ఇందిరమ్మ ఇళ్ల సర్వేను త్వరగా పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య సూచించారు. మంగళవారం మండలంలోని పొలంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీ కార్యదర్శి స్రవంతికి పలు సూచనలు చేశారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్వేను త్వరగా పూర్తిచేసి నివేదిక అందించాలని సూచించారు. గ్రామంలోని దరఖాస్తుదారులతో మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి తో పాటు గ్రామ నాయకులు ఉన్నారు.
నార్సింగి, చిన్నశంకరంపేట మండలాల్లో..
చిన్నశంకరంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలని ఈ నెల 30 వరకు సర్వేను పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ సీహెచ్ ఏల్లయ్య కోరారు. మంగళవారం చిన్నశంకరంపేట, నార్సింగి మండల కేంద్రంలో ఆయన ఆకస్మికంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. నెలఖారు వరకు సర్వే పూర్తి చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment