కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని జీకేఆర్ గార్డెన్‌లో ఆదివారం రెంజుకి షోటోకాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలో జిల్లా జట్టు మొదటిస్థానంలో నిలిచింది. ఈసందర్భంగా కరాటే మాస్టర్ నగేష్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేటతో పాటు వివిధ జిల్లాల నుంచి సుమారు రెండు వేల మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. మెదక్ జిల్లా టీం మొత్తం 500 పాయింట్లతో మొదటిస్థానంలో నిలిచిందని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, సినియర్ కరాటే మాస్టర్స్ ప్రతాప్‌సింగ్, చంద్రశేఖర్, నాగేంద్ర, బాలకృష్ణ, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment