సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మనోహరాబాద్(తూప్రాన్): నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జీడిపల్లికి చెందిన వెంకటరమణ తన తండ్రి అనంతరాములు, సోదరుడు విజయప్రసాద్ జ్ఞాపకార్థం సుమారు రూ. 10 లక్షలతో గ్రామంలో ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అయితే వాటి నిర్వహణ చాలా ముఖ్యమన్నారు. యువత అసాంఘీక కార్యాకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ రంగకృష్ణ, ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ మాజీ సర్పంచ్ రేఖ, నాయకులు, గ్రామస్తులు త దితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment