పోలీస్ సేవలనువినియోగించుకోండి
● ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్‌మున్సిపాలిటీ: ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించి, తక్షణమే వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి పైరవీలకు తావు లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌శాఖ పని చేస్తుందన్నారు. ప్రజాసమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో సమస్యలు పరిష్కరిస్తున్నామని వివరించారు.
కేసీఆర్‌ను కలిసిన పద్మారెడ్డి
మెదక్‌మున్సిపాలిటీ: మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నియోజవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు హైదరాబాద్‌లో ఆమెను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పద్మారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈసందర్భంగా పద్మారెడ్డిని కేసీఆర్ ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రైతులను నట్టేట ముంచారు
మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి
పాపన్నపేట(మెదక్): రైతు భరోసా పేరిట ఏటా రూ. 15 వేలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి రైతులను నట్టేట ముంచిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో అమలు కానీ హామీలు గుప్పించారని మండిపడ్డారు. రైతు భరోసాను రూ. 12 వేలతో సరిపెట్టారని అన్నారు. ఇప్పటికే వానాకాలం పెట్టబడి సాయం ఎగ్గొంటిందన్నారు. ఇప్పటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ఉచిత విద్యుత్ సైతం వేలాది మంది అర్హులకు అందలేదని ఆయన పేర్కొన్నారు.
ఖేడ్‌లో ఔటర్ రింగ్‌రోడ్డు
● ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా రింగ్‌రోడ్డుతోపాటు ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. పట్టణం సమీపంలోని కాంజీపూర్ రోడ్డు నుంచి నిజాంపేట–నారాయణఖేడ్–బీదర్ జాతీయ రహదారి వరకు నిర్మిస్తున్న రింగురోడ్డు పనులకు పట్టణ శివారులోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో సోమవారం భూమిపూజ నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెంకటాపూర్ సమీపం నుంచి ఔటర్ రింగురోడ్డును ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో రహదారులనూ విస్తరిస్తామని చెప్పారు. 40 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్న రింగురోడ్డుకు స్వచ్ఛందంగా రైతులు భూ ములు ఇవ్వడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్లు వివేకానంద్, రాజేష్ చౌహాన్, మాజిద్, రామకృష్ణ, రమేష్ చౌహాన్, తాహెర్‌అలీ, వీరన్న, కిషన్ నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment