ఆయిల్‌పామ్‌తో అధిక దిగుబడి
రాష్ట్ర ఆయిల్‌పామ్ టెక్నికల్ సలహాదారు రంగనాయకులు
రేగోడ్(మెదక్): ఆయిల్‌పామ్ సాగుతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర ఆయిల్‌పామ్ టెక్నికల్ సలహాదారు డాక్టర్ రంగనాయ కులు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం రైతులకు అవగాహన క ల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుకు ఉద్యానవన శాఖ ద్వారా మొక్కలపై రాయితీతో పాటు నాలుగేళ్ల పాటు తోట నిర్వహణ, అంతర పంటల సాగు రాయితీ కలిపి రూ. 28,450 సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. 2024– 25 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 2,000 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటల సాగుకు ప్రణాళిక చేసినట్లు వివరించారు. అనంతరం మండలంలోని ప్యారారంలో రైతు నర్సింగ్‌రావు సాగుచేస్తున్న ఆయిల్‌పామ్ పంటను పరిశీలించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు మున్నూరు కిషన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎస్.దిగంబర్‌రావు, ఏఓ జావీద్, ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ కృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment