అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలపై అలసత్వం తగదని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సో మవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 61 అర్జీలు రాగా.. పింఛన్ల కోసం 3, భూ సమస్యలు 20, ఇందిరమ్మ ఇళ్ల కోసం 11, ఇతర సమస్యలపై 27 వినతులు వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన విజ్ఞప్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అదే విధంగా అర్జీలు పెండింగ్‌లో లేకుండా త్వరితగతిన పరిష్కరించి పూర్తి చేయాలని సూచించారు. మండలస్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్‌ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాసరావు, ఏఓ యూనస్, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment