ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సహాసినిరెడ్డి
వెల్దుర్తి(తూప్రాన్): ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. సెహగల్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సోమవారం మండలంలోని మానెపల్లి వాగుపై చెక్ డ్యాం నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. అంతకుముందు ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎన్‌జీఓ సొసైటీ సహకారంతో రైతుల సంక్షేమం కోసం సెహగల్ స్వచ్ఛంద సంస్థ పనిచేయడం అభినందనీయమని కొనియాడారు. చెక్‌డ్యాం నిర్మాణంతో వర్షం నీరు నిల్వ ఉండడంతో పాటు చుట్టుపక్కల పంట పొలాల్లో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో పూర్తిచేస్తుందని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు నరేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్‌రెడ్డి, సంస్థ ప్రతినిధులు బాలరాజు, సునీల్‌కుమార్, మల్లికార్జున్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్‌గౌడ్, నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment